IND vs NZ, Hockey World Cup 2023 (PIC @ International Hockey Federation)

Bhuvaneswar, JAN 22: హాకీ వ‌ర‌ల్డ్ కప్‌లో (Hockey World Cup 2023) భార‌త్‌కు న్యూజిలాండ్ (New Zealand) జ‌ట్టు షాకిచ్చింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో అడుగు పెట్టాల‌నుకున్న టీమిండియా క‌ల చెదిరింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పెనాల్టీ షూటౌట్‌లో(penalty shootout) 5-4తో విజ‌యం సాధించింది. క్వార్ట‌ర్స్ చేరాలంటే త‌ప్ప‌క గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భార‌త పురుషుల‌ జ‌ట్టు దూకుడుగా ఆడింది. అయితే.. మ్యాచ్‌లో నిర్ణీత‌ స‌మ‌యానికి ఇరు జ‌ట్లు త‌లా మూడు గోల్స్ చేశాయి. దాంతో స్కోర్ స‌మం అయింది. దాంతో, విజేత‌ ఎవ‌రో తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ నిర్వ‌హించారు. భార‌త గోల్ కీప‌ర్ పీఆర్ శ్రీ‌జేష్ (Srijesh) మూడు గోల్స్‌ను అడ్డుకున్నాడు. అయితే.. అత‌నికి గాయం కావ‌డంతో కృష‌న్ పాఠ‌క్ గోల్ కీపింగ్ చేశాడు. అత‌ను కూడా కీల‌క‌మైన గోల్ ఆపాడు. కానీ,, షంషేర్ గోల్ మిస్ అయ్యాడు. దాంతో న్యూజిలండ్ 5-4తో గెలుపొందింది.

త‌ర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో త‌ల‌ప‌డ‌నుంది. భార‌త్‌ గ్రూప్ డిలో అగ్ర‌స్థానంలో నిలిచి క్వార్ట‌ర్స్ చేరాల‌నుకుంది. అందుకు వేల్స్‌ 8 గోల్స్ తేడాతో ఓడిస్తే భార‌త్ నేరుగా క్వార్ట‌ర్స్‌కు చేరుకునేది. కానీ, 4-2తో మాత్ర‌మే గెలిచింది. న్యూజిలాండ్‌పై త‌ప్ప‌ని సరిగా గెల‌వాల్సిన మ్యాచ్ చేజారింది. జ‌న‌వ‌రి 26న భారత్ జ‌పాన్‌తో క్లాసిఫికేష‌న్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది.