Woman abuses spits on cab driver.. here are the details(Incognito)

Delhi, Jan 15:  ఓ క్యాబ్ డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి నెటిజన్ల చేత విమర్శల పాలైంది మహిళ. ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా డ్రైవర్‌పై ఉమ్మేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోగ్నిటో అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో 5 లక్షల వ్యూస్‌కి చేరుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తనను మహిళ తిడుతుండగా రహస్యంగా వీడియో తీశారు డ్రైవర్‌. ఈ వీడియోలో డ్రైవర్‌పై దుర్భాషలాడుతూ, అతని మీద ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైందని డ్రైవర్ చెబుతున్నప్పటికి పట్టించుకోలేదు. గట్టిగా అరుస్తూ డ్రైవర్‌పై ఉమ్మివేసి, వాహనం నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే మహిళ ఎంత తిడుతున్న ఆ డ్రైవర్ మాత్రం మిన్నకుండిపోయాడు.  ఉత్తరప్రదేశ్‌లో అమానుషం..ఆటో డ్రైవర్‌పై యువతి దాడి, సారీ చెప్పినా వినకుండ దాడి చేసిన యువతీ, వీడియో ఇదిగో 

అయితే వీడియో చూసిన వీక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్యాబ్ సేవలందించే సంస్థలు ఇటువంటి వారిని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. డ్రైవర్‌లను ఇటువంటి అనుచిత కస్టమర్ల నుంచి రక్షించడం క్యాబ్ కంపెనీల బాధ్యత అని.... @Olacabs @Uber_India ఈ డ్రైవర్ మీ సంస్థకు పనిచేస్తుంటే, అతనికి మద్దతు ఇవ్వండని సూచిస్తున్నారు. డ్రైవర్ ఆలస్యమైతే క్యాబ్‌ను రద్దు చేసుకోవచ్చు, కానీ వాహనంలోకి చేరిన తర్వాత ఇలా ఎందుకు? డ్రైవర్‌ను అవమానించే హక్కు ఆమెకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు.

Woman abuses spits on cab driver.. here are the details

ఈ వీడియోలో కేవలం ఆడియో మాత్రమే రికార్డ్ చేయబడింది. మహిళ లేదా డ్రైవర్ ముఖాలు కనిపించలేదు.