Delhi Police, Dailyhunt And OneIndia Collaborate: ఢిల్లీ పోలీసులతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించిన డైలీహంట్, వన్ఇండియా.. . సైబర్ భద్రత కోసమే ఒప్పందం
ఢిల్లీ పోలీసులతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. సైబర్ భద్రత, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన, ఇతర సామాజిక సమస్యల నివారణకు రెండేళ్ల పాటు కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించాయి.
Newdelhi, June 13: స్థానిక భాషా కంటెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్ డైలీహంట్ (DailyHunt), వెబ్ పోర్టల్ వన్ ఇండియా (OneIndia).. ఢిల్లీ పోలీసులతో (DelhiPolice) కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. సైబర్ భద్రత (Cyber Cecurity), మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన, ఇతర సామాజిక సమస్యల నివారణకు రెండేళ్ల పాటు కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించాయి.
డైలీహంట్ గురించి: డైలీహంట్ భారతదేశంలోని స్థానిక భాషా కంటెంట్ ప్లాట్‌ఫారమ్, ప్రతిరోజూ 15 భాషల్లో 1మిలియన్ + కొత్త కంటెంట్ అందిస్తోంది. డైలీహంట్ ప్రతి నెలా 350 మిలియన్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్‌లకు (MAUs) సేవలందిస్తుంది.
వన్‌ఇండియా గురించి: వన్‌ఇండియా అనేది బహుభాషా వార్తల ప్లాట్‌ఫారమ్, రెండు దశాబ్దాలుగా ఇంగ్లీషుతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా వంటి 11 భారతీయ స్థానిక భాషలలో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ వార్తలను అందిస్తోంది.