Newdelhi, June 13: భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై (Central Government) తీవ్రస్థాయిలో ఆరోపణల చేసిన ట్విట్టర్ (Twitter)​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సేకు (Jack Dorsey) కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) అదే స్థాయిలో స్పందించారు. డోర్సే వ్యాఖ్యలు అబద్దాలని, భారత చట్టాలను పాటించాలని చెప్పినందుకు ఇలా మోసపూరితంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ట్విట్టర్ ను నిషేధిస్తామని తాము ఎలాంటి బెదిరింపులకు దిగలేదని స్పష్టం చేశారు. అసలేమైందంటే, రైతు నిరసనల నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అకౌంట్లను బ్లాక్​ చేయాలని ట్విట్టర్​కు అనేక మార్లు అభ్యర్థనలు అందినట్టు డోర్సే ఓ ఇంటర్వ్యూ లో వివరించారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం ట్విట్టర్​ను ఒత్తిడికి గురిచేసినట్టు, అవసరమైతే సామాజిక మాధ్యమాన్ని నిషేధిస్తామని కూడా బెదిరించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం పైవిధంగా వివరణ ఇచ్చింది.

Bengaluru Horror: బాత్రూమ్‌లో కలిసి స్నానం చేస్తూ యువ జంట దుర్మరణం.. గీజర్ లోంచి గ్యాస్ లీక్‌ కావడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం, కొద్దిసేపటికే దుర్మరణం.. బెంగళూరులో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)