Kalki 2898 AD Beats Jawan: షారూఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి 2898 ఏడీ, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డు
ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగాను రికార్డు నెలకొల్పింది.
Kalki 2898 AD Beats Jawan: టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగాను రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగాను అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని వెనక్కి నెట్టేసింది.
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన 'బాహుబలి2', 'కేజీఎఫ్2', 'ఆర్ఆర్ఆర్' తర్వాత నాలుగో స్థానంలో 'కల్కి..' ఉంది. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న 'జవాన్' మూవీ రూ. 640.25 కోట్లు వసూలు చేయగా.. కల్కి ఇప్పటివరకు రూ. 640.30 కోట్లు రాబట్టింది. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం షోల నుండి రూ. 15 లక్షలు వసూలు చేయడంతో ఈ చిత్రం కలెక్షన్లు రూ. 640.30 కోట్లకు చేరాయి. దీంతో భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డుకెక్కింది. జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వసూలు చేస్తే దేశంలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్రభాస్ మూవీ
ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా సినిమా అభిమానుల కోసం మేకర్స్ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. ఈ నెల 2 నుండి 9 వరకు కేవలం 100 రూపాయలకే టిక్కెట్‌లను విక్రయించనున్నట్లు తెలిపారు.