Vijayawada Horror: వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!

భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది.

Vijayawada Horror (Credits: X)

Vijayawada, Sep 2: భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) ధాటికి విజయవాడ (Vijayawada) ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి సమయంలోనే మరో దయనీయ ఘటన చోటుచేసుకుంది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ కారుపై మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే, చుట్టూ వరద ప్రవాహం ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో కొన్ని గంటలుగా ఆ మృతదేహం కారు మీద అలాగే ఉండిపోయింది.

తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్‌ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక

అధికారులకు సమాచారమిస్తే..

అయితే, మృతదేహం గురించి అధికారులకు సమాచారమిచ్చినా.. వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బీభ‌త్సంపై రంగ‌లోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణ‌కు ఏ సాయం కావాల‌న్నా చేస్తాన‌ని హామీ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement