Home Minister Amit Shah Calls Telugu states CM's (PIC@ ANI, FB)

New Delhi, SEP 01:  బంగాళా ఖాతంలో అల్ప‌పీడనం తీవ్ర వాయుగుండంగా మార‌డం.. ‘అస్నా’ తుఫాన్(Asna Cyclone) కార‌ణంగా భారీ వ‌ర్షాల‌తో తెలుగు రాష్ట్రాల్లోని (Heavy Rains in Telugu states) జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. ఇప్ప‌టికే ప‌లుచోట్ల కొంద‌రు గ‌ల్లంత‌య్యారు. వ‌ర‌ద నీరు ఇండ్ల‌లోకి రావ‌డంతో పాటు ప‌లు చోట్ల రోడ్డులు తెగిపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు భ‌య‌పెడుతున్నాయి. దాంతో, రెండు రాష్ట్రాల్లోని ప‌రిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరా తీశారు.

Railway Track Swept Away: భారీ వ‌ర్షాల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మ‌హ‌బూబాబాద్ లో బీభ‌త్సం సృష్టిస్తున్న వ‌ర‌ద‌లు, ప‌లు రైళ్లు ఆల‌స్యం, దారి మ‌ళ్లింపు (వీడియో ఇదుగోండి) 

తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయ‌డుల‌కు (CM Chandrababu) ఆయ‌న ఫోన్ చేశారు. త‌క్ష‌ణ‌మే అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌ని ఆయ‌న ఇద్ద‌రు సీఎంల‌కు హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రేవంత్ రెడ్డి షాకు వివ‌రించారు.

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, విజయవాడలో బుడమేరు వాగు ఉగ్రరూపం, ప్రవాహ తీవ్రత దెబ్బకు వెనక్కి ప్రవహిస్తున్న నది, తీవ్ర భయాందోళనలో ప్రజలు 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది ఉంటారు. ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు ఇస్తారు. ఇవన్నీసెప్టెంబర్ 2 ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ తెలిపింది. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ వెల్లడించింది. వాయు మార్గంలో మరో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది. అలాగే సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు తెలిపింది. రేపటి నుండి హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.