Railway Track Swept Away In Mahabubabad (PIC@ X)

Mahabubabad, SEP 01: భారీ వర్షాలతో మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి.

వీడియో ఇదుగోండి

 

మహబూబాబాద్‌ మండలం అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరి పంట మొత్తం నీటమునిగింది. నెల్లికుదురు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఎగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు.

Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు  

ఇక రాజుల కొత్తపల్లి చెరువుకట్ట తెగడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్నా స్వామి కుంట కట్ట తెగిపోవడంతో రోడ్డు కోతకు గురయింది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ, గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వీడియో ఇదుగోండి

 

ఇక జిల్లాలో అత్యధికంగా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., తొర్రూరులో 25 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., మహబూబాబాద్‌లో 26.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.