Trump Shot at During Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ పై బుల్లెట్ల వర్షం కురిసింది.

Donald Trump at White House (Photo Credits: Trump Twitter page)

Newyork, July 14: అధ్యక్ష ఎన్నికల వేళ కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా (America) ఉలిక్కిపడింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ పై (Trump Shot at During Rally) బుల్లెట్ల వర్షం కురిసింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ట్రంప్‌ నకు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావమయింది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో పొడియం వెనక్కి జరిగి కిందకు వంగారు. వెంటనే అప్రతమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

అంబానీ ఇంట ఫంక్ష‌న్ కు ప్ర‌ధాని మోదీ, నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన న‌రేంద్ర మోదీ, శుభ్ ఆశీర్వాద్ వేడుక‌లో సంద‌డి

ఒక్కసారిగా భయాందోళన

ఊహించని రీతిలో జరిగిన ఈ కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్‌ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. షూటర్‌ తో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయారని బట్లర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ గోల్డింగర్ చెప్పినట్టుగా ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది.

వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దుశ్చర్యను ఖండించిన అధ్యక్షుడు జో బైడెన్, మోదీ

ట్రంప్‌ పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్  తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఘటన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్టు వెల్లడించారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif