 
                                                                 Mumbai, July 13: ప్రపంచ స్థాయి అతిథులు, దేశ సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల వివాహం (Anant Ambani-Radhika Merchant) శుక్రవారం రాత్రి అత్యంత ఆడంబరంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. ‘శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్’ పేరుతో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవం జరిగిన ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’లోనే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendr Modi) హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
PM Modi arrives at the #Ambani Gala pic.twitter.com/v0AMvMS045
— Sneha Mordani (@snehamordani) July 13, 2024
వచ్చిన అతిథులంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖులంతా ఆడి, పాడి.. అంబానీ ఇంట వేడుకలో మరింత ఆనందోత్సవాలను నింపారు. తమిళ నటుడు రజనీకాంత్‌తో పాటు పలువురు నటులు డ్యాన్స్ చేసి అందరిలో హుషారు నింపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
