Fact Check: విద్యుత్ బిల్లు మాఫీ 2020 స్కీమ్ అంతా ఫేక్, విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్న వార్త అంతా అబద్దం, కేంద్రం అలాంటి పథకాన్నే తీసుకురాలేదని స్పష్టం పీఐబీ
అది నిజమో కాదో తెలియకుండానే నెటిజన్లు దాన్ని భారీగా షేర్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ మధ్య ఒక విషయం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది. ఇక నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదంటూ (Power Bill Waiver Scheme) ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియా వేగం పుంజుకున్న తరువాత ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తెగ వైరల్ అవుతూ వస్తోంది. అది నిజమో కాదో తెలియకుండానే నెటిజన్లు దాన్ని భారీగా షేర్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ మధ్య ఒక విషయం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది. ఇక నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదంటూ (Power Bill Waiver Scheme) ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు మాఫీ 2020 స్కీమ్ (Electricity Bill Waiver Scheme) తెచ్చిందని.. ఆ పథకం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్నది సదరు వార్త సారాంశం.
ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందంటూ ఓ యూట్యూబ్ వీడియోను కూడా జోడించి చాటింపు చేస్తున్నారు. ఇది నిజమని నమ్మిన కొందరు జనాలు శుభవార్త అంటూ దీన్ని ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధమేనని కేంద్ర దర్యాప్తు సంస్థ విభాగం పీఐబీ(ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో) (PIB Fact Check) తేల్చి చెప్పింది. అసలు కేంద్రం అలాంటి పథకాన్నే తీసుకురాలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎవరూ ఈ తప్పుడు వార్తను నమ్మవద్దని సూచించింది. ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా, గోవా ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్
PIB Fact Check
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఇలాంటి ఫేక్ విషయాలతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరైనీ మీ వివరాలు కోరితే తెలియజేయవద్దని తెలిపింది. లేదంటే మోసపోవాల్సి వస్తుందని పేర్కొంది