Coronavirus in India: ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా, గోవా ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 78,357 మందికి కరోనా, 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్
COVID-19 Outbreak in India | File Photo

New Delhi, September 2: గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 78,357 కరోనా పాజిటివ్‌‌ కేసులు (Coronavirus in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. కోవిడ్‌ రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 (Coronavirus Cases in India) యాక్టివ్ కేసులున్నాయి.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉందని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.

తాజాగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ క‌రోనా వైర‌స్ (Goa CM Pramod Sawant tests positive for COVID-19) బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని చెప్పారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు సీఎం పేర్కొన్నారు. ఇంటి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సీఎం సావంత్ విజ్ఞ‌ప్తి చేశారు.

Goa CM Pramod Sawant tests positive for COVID-19

ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా సర్వేలను నిర్వహిస్తున్నసెరలాజికల్‌ సర్వేలో కీలక వివరాలు వెలుగుచూస్తున్నాయి. చెన్నైలో ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్‌ (2020 Coronavirus Pandemic in India) బారినపడినట్టు వెల్లడైంది. చెన్నై జనాభాలో 21.5 శాతం మంది ఇప్పటికే కోవిడ్‌-19 బారినపడగా నగర జనాభాలో 80 శాతం మంది వైరస్‌ సోకే అనుమానిత జాబితాలో ఉన్నట్టు సర్వే తెలిపింది. నగరంలోని వివిధ జోన్లలో వ్యాధి సంక్రమణ వివిధ స్ధాయిల్లో ఉందని పేర్కొంది. చెన్నైలో 15 జోన్లకు చెందిన 51 వార్డుల్లో 12,405 రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా 2673 మందికి గతంలో కోవిడ్‌-19 సోకిందని సర్వే గుర్తించింది. రాష్ట్రాలకు జీఎస్టీ ప‌రిహారం పూర్తిగా చెల్లించాలి

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీలను గుర్తించేందుకు వ్యక్తుల రక్త నమూనాలను సెరో సర్వేలో పరీక్షిస్తారు. కోవిడ్‌-19 సంక్రమణను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సెరో సర్వేలు నిర్వహిస్తున్న క్రమంలో చెన్నైలో చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయి. ఢిల్లీలో ఇప్పటికే పలుమార్లు సెరో సర్వేలను నిర్వహించగా తాజాగా మంగళవారం ప్రారంభమైన సర్వేలో 17,000 శాంపిళ్లను పరీక్షించనున్నారు. జీడీపీ భారీగా పతనం..నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనం, కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ

వైరస్‌ లక్షణాలు బయటకు కనిపించని రోగుల్లోనూ వైరల్‌ లోడ్‌ (వైరస్‌ సంఖ్య) అధికంగా ఉన్నట్టు హైదరాబాద్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 210 మంది రోగులపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. నమూనాలు సేకరించిన రోగుల్లో ఎక్కువగా (దాదాపు 95 శాతం) 20బీ స్ట్రెయిన్‌ వైరస్‌ ఉన్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌ పరిసరాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగడానికి అతి ఎక్కువ తీవ్రత కలిగిన ‘డీ614జీ’ రకం వైరస్‌ ఉత్పరివర్తనమే కారణమని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు.