PM Modi vs Rahul Gandhi (Photo Credits: PTI)

New Delhi, Sep 1: ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో దేశ జీడీపీ తొలిసారిగా 23.9 శాతం పతనమవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలను (Congress Attacks Govt over GDP Slump) ఎక్కుపెట్టింది. దీనికి తోడు కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు (GDP Slum) పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఆగడం లేదు. జీడీపీ పతనంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైందని (Ruining of economy began with demonetisation), ప్రభుత్వం ఆపై వరుసగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో దేశ జీడీపీ ఎన్నడూలేని విధంగా 23.9 శాతం పతనమైన విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం మొదలవగా, ఆపై ప్రభుత్వం ఒకదాని వెంట ఒకటిగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Rahul Tweets

ఆర్థిక వ్యవస్థ పతనానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యతని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆర్థిక సంక్షోభంపై రాహుల్‌ గాంధీ ఆరు నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం కంటితుడుపుగా ప్యాకేజ్‌ను ప్రకటించిందని, ఇప్పుడు వాస్తవ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు. రాహుల్‌కి పగ్గాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ కనుమరుగు, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా సైతం జీడీపీ పతనంపై మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోదీజీ.. మీరు ఒకప్పుడు అద్భుత అస్త్రాలుగా అభివర్ణించినవి తుస్సుమన్నాయని ఇప్పుడైనా అంగీకరించండని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన అనంతరం ఆర్థిక వ్యవస్థ వీ ఆకారంలో కోలుకుంటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణ్యం అన్నారు.

ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకుడు పి. చిదబంరం మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. దేవుడిని నిందించవద్దు. నిజానికి మీరు దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు రైతులను ఆశీర్వదించాడు. మహమ్మారి ప్రకృతి విపత్తు. కానీ మీరు వైరస్‌ను మానవ నిర్మిత విపత్తుతో కలిపేస్తున్నారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా చిదంబరం వర్ణించారు.  మళ్లీ సోనియాకే జై కొట్టిన కాంగ్రెస్ పెద్దలు, 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ నియామకం

కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా నెల‌కొన్న ఆర్థిక కొర‌త నేప‌థ్యంలో ప‌రిహారం కోరుతూ రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో 41వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని అన్నారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్‌టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేసింది.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రా ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రతిపాదనలు ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు, సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఆగ్రహం

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ ( స్థూల జాతీయోత్పత్తి) ఏకంగా 23.9 శాతం పతనమైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటే.. ఈసారి రికార్డు స్థాయిలో క్షీణించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క వ్యవసాయ రంగం మినహా ఇతర రంగాలన్నీ భారీగా క్షీణతను నమోదు చేశాయి. వ్యవసాయం రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఈసారి 3.4 శాతం వృద్ధి కనబర్చింది. ఇక కరోనాకు ముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.

మార్చిలో విధంచిన లాక్‌డౌన్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించినా.. వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో 1996 నుంచి త్రైమాసిక గణాంకాలను విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి ఇంత దారుణమైన పతనం ఎప్పుడూ నమోదు కాలేదు. తదుపరి త్రైమాసికం (జూలై, ఆగస్ట్, సెప్టెంబర్)లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.