Fact Check: ఫిబ్రవరి నెల గురించి వైరల్ పోస్ట్, 823 ఏళ్లకు ఒకసారి రావడం అనేది అబద్దం, ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, నిజ నిర్థారణ చేసుకోండి

రాబోయే ఫిబ్రవరి మీ జీవిత కాలంలో మళ్ళీ రాదు ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 వ గురువారాలు, 4 శుక్రవారాలు & 4 శనివారాలు ఉన్నాయి.ఇది ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది

Fact Check

శతాబ్దాల తర్వాత 2022 ఫిబ్రవరి నెలలో నిజంగానే ఒక ప్రత్యేకమైన యాదృచ్చికం జరగబోతోందా? వాస్తవానికి ఈ ఏడాది కూడా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లో వచ్చే నెల నాలుగు శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో వస్తోందని, ఇది 823 ఏళ్లకు (Comes Once in 823 Years) ఒకసారి జరుగుతుందని.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల.. దీనికి ముందు, సోషల్ మీడియాలో ఒక సందేశం చాలా వైరల్ ( Viral Whatsapp Message) అవుతుంది.

రాబోయే ఫిబ్రవరి మీ జీవిత కాలంలో మళ్ళీ రాదు ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 వ గురువారాలు, 4 శుక్రవారాలు & 4 శనివారాలు ఉన్నాయి.ఇది ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.దీన్ని మనీ బ్యాగ్స్ అంటారు.కాబట్టి కనీసం 5 మందికి లేదా 5 గ్రూపులకు పంపండి. డబ్బు 4 రోజుల్లో వస్తుంది.చైనీస్ ఫెంగ్ షుయ్ ఆధారంగా.చదివిన 11 నిమిషాల్లో పంపండి’ అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలా ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు రావడం కొత్తేమి కాదు. నెలలో 28 రోజులున్న ఉన్న ప్రతిసారి ఇలా జరుగుతుంది. లీప్ ఇయర్ కాని సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, ఎందుకంటే (నెలలోని 28 రోజులు/ 7 (వారం) = 4), అంటే ఖచ్చితంగా నాలుగు వారాలు, ఆ వారాల్లోని అన్ని దినాలు వస్తాయి. ఉదాహరణకి 2019, 2021, 2022, 2023 సంవత్సరాలను గమనిస్తే ఈ సంవత్సరాలలో ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని ప్రతీ రోజు నాలుగు సార్లు రావడం (4 ఆదివారాలు, 4 సోమవారాలు,…etc) చూడొచ్చు.

లీప్ ఇయర్ లో 1st ఫిబ్రవరి ఏ రోజవుతుందో ఆ ఒక్క రోజు 5 సార్లు, మిగతావి 4 సార్లు వస్తాయి. ఐతే ఇలా ఫిబ్రవరి నెలలో అన్ని రోజులు నాలుగు సార్లు పునరావృతం కావడం 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న వాదనలో నిజం లేదు. లీప్ ఇయర్ కాని సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి.

క్లెయిమ్: ఫిబ్రవరి 2021 లో ఒక వారంలోని అన్ని దినాలు నాలుగు సార్లు రావడం (4 ఆది, 4 సోమ, etc). ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే సంఘటన.

ఫాక్ట్ (నిజం): నెలలో 28 రోజులున్న ఉన్న ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి. అంటే ఒక్క లీప్ ఇయర్ లో తప్ప ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఇలా వారంలోని ప్రతీ రోజు నాలుగు సార్లు వస్తాయి (4 ఆది, 4 సోమ, etc). ఇలా కేవలం 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.