Wildlife photographer: మబ్బుల మధ్య చేపలా.. నీలి సముద్రంలో మీనాలా? ఎంత అద్భుతం

ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్‌ హోంకాలెంపీ సరస్సులో తీశారు.

Helsinki, September 4: కొన్ని చిత్రాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదీ అలాంటిదే. నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలోని వెండి మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్‌ హోంకాలెంపీ సరస్సులో తీశారు. ‘అండర్‌వాటర్‌ వండర్‌­ల్యాండ్‌’లా టోర్మెనెన్‌ అభివర్ణిస్తున్న ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో ఎన్నదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ విభాగాల్లో విజేతలను అక్టోబర్‌ 11న ప్రకటిస్తారు. ఫోటోలో మేఘాల్లా కనిపిస్తున్నవి ఒకరకమైన నాచు అట. ఎంత బాగుందో కదూ..



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif