IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్‌ భారీ విజయం, ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌

చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

Ravichandran Ashwin (Photo Credits: BCCI)

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో సెంచరీ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి (6/88)తో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లా పనిపట్టాడు.

బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు

రవీంద్ర జడేజా (3/58) రాణించడంతో 515 పరుగుల ఛేదనలో పర్యాటక జట్టు 234 పరుగులకే ఆలౌట్‌ అయి భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో రెండో టెస్టు ఈనెల 27 నుంచి కాన్పూర్‌ వేదికగా జరుగనుంది.