Who is Hasan Mahmud: భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న హసన్ మహమూద్ ఎవరు ? నాలుగు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ పేసర్

Hasan Mahmud (Photo-X)

గురువారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు హసన్ మహమూద్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. నాలుగో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రిషభ్‌పంత్ వంటి స్టార్ల వికెట్లను తీసుకుని షాకిచ్చాడు. అతడి దెబ్బకు 96 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.

ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌లలో ఆరు వికెట్లు పడగొట్టినప్పుడు హసన్ మొదటిసారి రెడ్-బాల్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. అతను గత నెలలో రావల్పిండిలో అద్భుతమైన ప్రదర్శనతో దానిని అనుసరించాడు, అక్కడ రెండవ ఇన్నింగ్స్‌లో అతని తొలి ఐదు వికెట్ల (5/43) మార్క్ బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో సహాయపడింది.

వీడియో ఇదిగో, ప‌రుగు ఎలా తీస్తావ్‌ అంటూ మైదానంలో పంత్‌తో గొడవపడిన లిట్టన్ దాస్, రివర్స్ కౌంటర్‌ విసిరిన పంత్

24 ఏళ్ల మహమూద్ మార్చి 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడిన మహమూద్ ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి ఒక్కసారి ఫేమస్ అయ్యాడు. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకుని చరిత్ర సృష్టించడంలో మహమూద్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై టెస్టుకు ముందు మూడు టెస్టుల్లో మహమూద్ 14 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు నేలకూల్చాడు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు