Man Marries Female Goat: ఆడ మేకను పెళ్లి చేసుకున్న వ్యక్తి, మేకకు కన్యాశుల్కం ఇచ్చి మరీ తాళి కట్టాడు, ఇండోనేషియా ఆచారం ప్రకారం పెళ్లి తంతు, ఇంతకీ కట్నం ఎంతో తెలుసా?

దీంతో వింత వింత‌ ప‌నులు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచ‌న‌తోనే ఓ ఇండోనేషియ‌న్ (Indonesian ) ఆడ మేక‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుక‌ను షూట్ చేసి, యూట్యూబ్‌లో (You tube) పెట్టాడు.

Jakarta, June 10: ఇంట‌ర్నెట్‌లో రాత్రికి రాత్రే ఫేమ‌స్(Famous) అయిపోవాల‌ని చూస్తున్నారు. దీంతో వింత వింత‌ ప‌నులు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచ‌న‌తోనే ఓ ఇండోనేషియ‌న్ (Indonesian ) ఆడ మేక‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుక‌ను షూట్ చేసి, యూట్యూబ్‌లో (You tube) పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. తూర్పు జావాలోని గ్రెసిక్‌కు చెందిన సైఫుల్ ఆరిఫ్ (Saiful Arif) అనే 44 ఏళ్ల వ్యక్తి యూట్యూబర్. ఇంట‌ర్నెట్‌ను ఆక‌ర్షించాల‌నే ఉద్దేశంతో జూన్ 5న గ్రేసిక్‌లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో రహయు బిన్ బెజో అనే పేరుగ‌ల ఆడ మేకను (female goat) వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక‌ను వీడియో తీశాడు.

ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించి కనిపించగా, మేకను శాలువాతో అలంక‌రించారు. స్థానికులు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు హాజ‌ర‌య్యారు. అత‌డు మేక‌కు రూ. 22,000 క‌ట్నం కూడా ఇచ్చాడు.

Mystery Creature: అర్థరాత్రి రెండు కాళ్లతో రోడ్డు మీద భయానక జీవి, సీసీటీవీ కెమెరాలో రికార్డు, భయాందోళనకు గురవుతున్న టెక్సాస్ పరిసర ప్రాంతాల ప్రజలు 

అయితే, ఈ వీడియోపై నెటిజ‌న్లు మండిప‌డ్డారు. దీంతో సైఫుల్ అంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమేనని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో చేయ‌లేద‌ని పేర్కొన్నాడు.