Kerala Blast Viral Video: కేరళలో వరుస బాంబు పేలుళ్లు..2500 మంది హాజరైన సమావేశంలో పేలిన బాంబు..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
అనుమానిత ఉగ్రవాదుల దాడిలో కనీసం 36 మంది గాయపడినట్లు సమాచారం. ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కేరళలోని ఎర్నాకులం కలమస్సేరిలో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. అనుమానిత ఉగ్రవాదుల దాడిలో కనీసం 36 మంది గాయపడినట్లు సమాచారం. ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఓ మతానికి చెందిన సమావేశంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మూడు పేలుళ్లు సంభవించాయి. పేలుడు అనంతరం ముంబై, పూణెలో కూడా అలర్ట్ ప్రకటించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి, కన్వెన్షన్ సెంటర్‌లో బాంబు పేలుడు తర్వాత రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేయాలని NIA, NSGని ఆదేశించారు.
ప్రాథమిక అంచనా ప్రకారం ఇది తీవ్రవాద దాడి అని ఆధారాలు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారని త్రిక్కకర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. 5-10 సెకన్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని తెలిపారు.