MP Shocker: నన్నే రేప్ చేస్తావా..రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన యువతి, నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎంపీ పోలీసులు, నాపై కొడవలితో దాడి చేసిందని మహిళపై ఫిర్యాదు చేసిన నిందితుడు
తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి పురుషాంగాన్ని (Woman cuts off man''s genitals) యువతి కోసేసింది. నన్నే రేప్ చేస్తావా (he tries to rape her) అంటూ అతడిపై విరుచుకుపడి కొడవలితో అతడి జననేంద్రియాలను కట్ చేసి పడేసింది.ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
Sidhi, Mar 20: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి పురుషాంగాన్ని (Woman cuts off man''s genitals) యువతి కోసేసింది. నన్నే రేప్ చేస్తావా (he tries to rape her) అంటూ అతడిపై విరుచుకుపడి కొడవలితో అతడి జననేంద్రియాలను కట్ చేసి పడేసింది.ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధి జిల్లాలోని ఉమరిహా గ్రామానికి చెందిన మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. అయినప్పటికీ, అతడు మరింతగా రెచ్చిపోవడంతో ఇంట్లో ఉన్న కొడవలితో అతడిపై దాడి చేయగా, జననేంద్రియాలు కట్ అయిపోయాయి. అనంతరం పోలీసుస్టేషనుకు వెళ్లి సదరు మహిళ, అతడిపై ఫిర్యాదు చేసింది.
ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరిగిన సమయంలో మహిళ, ఆమె పదమూడేళ్ల కొడుకు మాత్రమే ఇంట్లో ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తి వారింట్లో చొరబడటంతో దొంగ అనుకుని, ఆ బాలుడు పారిపోగా, మహిళ అతడిని బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో అతడు లైంగికదాడికి యత్నించగా మంచం కింద ఉన్న కొడవలి తీసి అతడిపై దాడి చేసింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్‌స్టేషనుకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఇక ఆ వ్యక్తి సైతం, తనను గాయపరిచినందుకు మహిళపై ఫిర్యాదు చేశాడు. ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టాం’’ అని తెలిపారు.