Bengaluru Shocker: ప్రియుడి నగ్న వీడియోతో ప్రియురాలు బ్లాక్‌మెయిల్, బెంగుళూరులో ఘటన, హైదరాబాద్‌లో వితంతువును పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 3లక్షలు దోచుకున్న సైబర్‌ నేరగాడు, అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
Representational Image | (Photo Credits: PTI)

Hyderabad,Mar 20: ఓ వితంతువును కంపెనీకి డైరక్టర్ ని చేస్తానని నమ్మించిన బెంగుళూరు సైబర్ నేరగాడు (Bengaluru Shocker) ఆమె నుంచి రూ.మూడు లక్షల వరకు దోచుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రకాష్‌ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన రాజ్‌వన్స్‌ అనే వ్యక్తి ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ పూర్తయ్యాక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మైనింగ్‌తో పాటు టీకప్‌ల తయారీ పరిశ్రమను నిర్వహించాడు. అయితే వాటిల్లో నష్టాలు రావడంతో మూసేశాడు.

ఈ సమయంలో బెంగళూరులోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో హౌస్‌ కీపింగ్‌ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నానని నమ్మించి.. అవసరార్థం వ్యాపార విస్తరణ, వైద్యావసరాల కోసమంటూ ఓ వితంతువుతో పరిచయం పెంచుకుని ఆమెను నిండా ముంచాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్‌ ఆమెను ముంచాడు. చివరకు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు (Rachakonda police) చేతికి చిక్కాడు.

ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్‌లో తన వివరాలు నిక్షిప్తం చేశాడు. అయితే 2019 మార్చి నుంచి ఓ వితంతువు రాజ్‌వన్స్‌తో పరిచయం పెంచుకుంది. ఈ సమయంలో తనకు కూడా విడాకులయ్యాయని, అయితే బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్‌ కీపింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన కంపెనీలో డీలర్‌షిప్, డైరెక్టర్‌షిప్‌తో పాటు మీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు.

ఇదేమి కేసు బాబోయ్, అత్త వేడి అన్నం వడ్డించడం లేదట, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు, పని చేయకుండా రోజంతా మొబైల్ పట్టుకునే ఉంటుందని ఎదురు ఫిర్యాదు చేసిన అత్త

ఇదంతా నిజమని నమ్మి తన వ్యాపార విస్తరణకు, వైద్యం కోసం డబ్బులు అవసరమంటూ చెప్పడంతో బాధితురాలు దఫాదఫాలుగా రూ.మూడు లక్షలు రాజ్‌వన్స్‌ పంపిన బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత నుంచి అతడు స్పందించలేకపోవడంతో మోసపోయానని తెలిసి రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీ సులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక సాక్ష్యాలతో నిందితుడు రాజ్‌వన్స్‌ను బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు.

భార్య అరుపులకు తట్టుకోలేక తన నాలుక కోసుకున్న భర్త, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి, యూపీలో బాధాకర ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న యూపీ పోలీసులు

ఇక మరో చోట ఓ యువతి బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తికి ఊహించని షాకిచ్చింది. వాట్సప్‌ వీడియో కాల్‌ చేసి అతడి అశ్లీల వీడియోను రికార్డ్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసింది. ఫేస్‌బుక్‌లో ఓ యువతి స్థానిక వ్యక్తితో పరిచయం చేసుకుంది. తరచుగా చాట్‌చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో, ఈ నెల 13 నుంచి 16వ తేదీ మధ్యలో అతడికి వాట్సప్‌ వీడియో కాల్స్‌ చేసింది. అతడు నగ్నంగా ఉన్న సమయంలో వీడియోను రికార్డ్‌ చేసి దానిని సదరు వ్యక్తికి పంపి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు పంపకపోతే సోషల్‌ మీడియాలో సదరు వీడియోను అప్‌లోడ్‌ చేసి పరువుకు భంగం కల్గిస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.