Lucknow, Mar 20: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురయింది. అత్త తనకు వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వారంత ఒకప్పుడు అత్తలకు కోడళ్లు సపర్యలు చేయడం చుశాము కానీ ఇలా అత్త తనకు సేవలు చేయడం లేదని కోడలు ఫిర్యాదు (Woman complaints to police about mother-in-law) చేయడమెంటని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఏ కోడలైనా..అత్త తనను కట్నం కోసం వేధిస్తోందనీ..లేదా మరేరకంగానో వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కాని ఇలా చేయడమేంటని నోరు వెళ్లబెడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజహా పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్‌గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అత్త సమయానికి ఆహారం ( serves stale food) వడ్డించలేదంటూ కోడలు ఇటీవల పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందట. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని దర్యాప్తు చేయగా... ఆమె అత్త రోజంతా టీవీ సీరియల్స్‌లో లీనమైపోతోందని, తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదంటూ సదరు కోడలు పోలీసులకు చెప్పింది. అంతేగాక తనకు పాడైన ఆహారం పెట్టడం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని కోడలు పోలీసులతో వాపోయింది.
కోడలు తనపై ఫిర్యాదు చేయడం చూసి అత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోడలు పనులు చేయకుండా రోజంతా ఫోన్ పట్టుకునే ఉంటుందని, ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లేదంటూ పోలీసులకు చెప్పింది. అలాగే వంటింటి పనుల్లో కూడా తోడుగా ఉండటంలేదని..కనీసం ఒక్కరోజుకూడా వంట చేసింది లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక వారిద్దరి వాదనలు విన్న పోలీసులకు నవ్వాలో అర్థంకాని అయోమయంలో పడిపోయారు. ఆ తరువాత అత్తకోడళ్లలిద్దరినీ మందలించారు. ఇలాంటి చిన్న విషయాలకే ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లిపోయారు.