Uber (PIC@ Twitter)

Noida, March 31: క్యాబ్, ఆటో ఎక్కితే బిల్లు ఎంత అవుతుంది? ప్రయాణ దూరాన్ని బట్టి రూ.50, రూ.100 లేదంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అంతేగానీ, లక్షలు, కోట్ల రూపాయల్లో అవుతుందా? తాజాగా, ఉబెర్ క్యాబ్ (Uber Cab) ఎక్కిన ప్రయాణికుడు తనకు రూ.7.66 కోట్ల బిల్లు వచ్చిందని తెలుసుకుని ఉలిక్కిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను, బిల్లుకు సంబంధించిన ఫొటోను అతడు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. నోయిడాలో ఉబెర్ క్యాబ్ ఎక్కిన వినియోగదారుడికి ఈ అనుభవం ఎదురైంది. దీపక్ టెంగూరియా అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ ఎక్కాడు. అతడు ప్రయాణించిన దూరానికి కేవలం రూ.62 మాత్రమే అవుతుంది.

 

దీపక్ తన లొకేషన్‌ చేరుకుంటుండగా తన యాప్‌లో చూసుకున్నాడు. అందులో రూ.7.66 కోట్ల బిల్లు వేయడంతో (Rs 7 Crore Bill) షాక్ అయ్యాడు. ఇంత బిల్లు రావడం ఏంటని డ్రైవర్ ను అడిగాడు. తనకు మొత్తం రూ.7,66,83,762 బిల్లు వచ్చిందని చెప్పాడు. అందులో టిప్ చార్జి కోటిన్నరకుపైగా, వెయిటింగ్ చార్జి దాదాపు రూ.6 కోట్లుగా ఉంది. దీనిపై స్పందించిన ఉబర్ సంస్థ బిల్లు అలా ఎలా వచ్చిందో, సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో చూస్తామని తెలిపింది.



సంబంధిత వార్తలు

Online Fraud: ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి రూ 5 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఓ వ్యక్తి, అసలు మోసం ఎలా జరిగిందంటే..

Namma Yatri App: యాప్‌ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్లు సంపాదించిన బెంగళూరు ఆటో డ్రైవర్లు..

Indian-Origin Man in US Sentenced to Jail: ఉబర్ సాయంతో అమెరికాలోకి ఇండియన్లు అక్రమ రవాణా, భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

Bengaluru Viral Video: రైడ్‌ క్యాన్సిల్ చేయమన్నందుకు కస్టమర్‌పై దాడికి దిగిన ఆటో డ్రైవర్, బెంగళూరులో నడిరోడ్డుపై రౌడీయిజం చూపించిన ఆటోవాలా, వైరల్‌గా మారిన వీడియో

Uber Driver Attacked: రూట్‌ మార్చినందుకు ఉబెర్ డ్రైవర్‌ను చితకబాదిన ప్యాసింజర్, కెనడాలో భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ (వీడియో)

Mumbai: విమానాశ్రయానికి ఉబర్ బుక్ చేసుకున్న మహిళ, డ్రైవర్ లేటుగా తీసుకెళ్లడంతో విమానం మిస్, కోర్టుకెక్కిన బాధితురాలు, రూ. 20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

Uber Ride: ఊబర్ క్యాబ్ బుక్ చేస్తున్నారా.. అయితే 15 నిమిషాల రైడింగ్‌కు రూ.32.4 ల‌క్ష‌లు బిల్లు న్యూస్ చదవాల్సిందే, బిత్తరపోయిన యూకేలో ఓ వ్యక్తి

Uber Bill: ఆరు కిలోమీటర్లు కారులో ప్రయాణించాలంటే.. రూ. 32 లక్షలా? ఇంగ్లండ్ లో ఓ యువకుడికి ఉబర్ వేసిన బిల్లు ఇది.. అసలు ఏం జరిగిందంటే..?