Vastu Tips: ఉద్యోగం దొరకడం లేదా, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా, స్ధాయికి తగిన గుర్తింపు లభించాలనుకుంటున్నారా, ప్రతి రోజు ఉదయం 21 సార్లు ఈ పని చేయండి...
ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.
ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి. అలాగే తూర్పు, పశ్చిమాన ద్వారాలు ఉన్న ఇంట్లో ధనలాభం, వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ది, ఆరోగ్యం, సుఖజీవనం లాంటి ఫలితాలు కలుగుతాయి.
మీ ఇంట్లో సాలేగూళ్లు ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించండి. ఎందుకంటే నివాసంలో సాలేగూళ్లు ఉండకూడదని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఇది మీ పురోగతి నిరోధిస్తుంది. సాలేగూళ్లు ఉండటం మీ సోమరితనాన్ని కూడా సూచిస్తుంది. ఫలితంగా లక్ష్మీదేవి ఇంట్లో నివసించదు. పరిశుభ్రత, స్వచ్ఛత ఉండే ప్రదేశాల్లోనే లక్ష్మీ దేవి ఉండేందుకు ఇష్టపడుతుందని నమ్ముతారు. అందువల్ల మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.