KL Rahul Announces Retirement ? కేఎల్ రాహుల్ రిటైర్మెంట్‌లో నిజమెంత ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఇంకా స్పందించని భారత జట్టు స్టార్ ప్లేయర్
దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు.
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది.కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు. కేఎల్‌కు సంబంధించి మరో పోస్ట్ వైరల్‌గా మారింది.అయితే దీనిపై KL రాహుల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ అతని రిటైర్మెంట్ గురించి ప్రస్తావించిన అతని ఇన్‌స్టాగ్రామ్ కథనం యొక్క నకిలీ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం తెలియాలంటే మాత్రం రాహుల్ అధికారికంగా చెప్పేవరకు ఆగాల్సిందే.
ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులో కేఎల్ ఎంపికయ్యాడు. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీకి కూడా KL ఎంపికయ్యాడు. KL శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న A జట్టులో భాగంగా ఉన్నాడు. సెప్టెంబరు 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమ్ బీతో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ
Here's Screen Shots