Viral Video: దారుణం.. జొమాటో డెలివరీ బాయ్ ఆ పార్టులను పట్టుకుని కొరికేసిన కుక్క, మర్మాంగాల నుంచి రక్తం కారడంతో లబోదిబోమంటో ఆస్పత్రికి పరుగులు
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పన్వేల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో డెలివరీ ఇచ్చి వస్తున్న నరేంద్ర పెరియార్ అనే జొమాటో ఎగ్జిక్యూటివ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను లిఫ్ట్‌లో కిందకు వచ్చే సరికి ఎదురుగా ఒక జర్మన షెపర్డ్ డాగ్ కనిపించింది.
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పన్వేల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో డెలివరీ ఇచ్చి వస్తున్న నరేంద్ర పెరియార్ అనే జొమాటో ఎగ్జిక్యూటివ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను లిఫ్ట్‌లో కిందకు వచ్చే సరికి ఎదురుగా ఒక జర్మన షెపర్డ్ డాగ్ కనిపించింది. దాన్ని చూసిన వెంటనే భయంతో జొమాటో ఎగ్జిక్యూటివ్ వెనకడుగు వేశాడు.
ఆ కుక్క యజమాని దాన్ని పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. అది పక్కకు వెళ్లిందని జొమాటో ఎగ్జిక్యూటివ్ పెరియార్ (Zomato delivery executive) లిఫ్టులో నుంచి బయటకు వచ్చాడు. అయితే అతను అలా బయటకు రాగానే ఆ కుక్క అతనిపై ఒక్కసారిగా దాడి (German Shepherd bites Zomato delivery executive) చేసింది. అతని మర్మాంగాలను పట్టుకుని కొరికేసింది. కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రక్తం కారుతుంటే తనకు గాయమైందని (crotch at highrise in Panve) తెలిసుకున్న జొమాటో ఎగ్జిక్యూటివ్, దగ్గరలోని ఆస్పత్రికి లబోదిబోమంటూ వెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గలేదని చెప్పాడు.
Here's Viral Video
దీంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి అతన్ని తరలించారు. పెరియార్ మెడికల్ బిల్లులను కుక్క యజమానే భరిస్తున్నాడు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాటికి సరైన శిక్షణ ఇచ్చి చైన్ వేసి ఉంచాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.