
Hyd, Feb 19: ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో(Telangana bhavan) రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం, పార్టీ రజతోత్సవం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్(BRS Executive Committee Meeting).
ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించి పార్టీ అధినేత కేసీఆర్(BRS President KCR) దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైతు రుణమాఫీ, రైతుభరోసా ,బీసీ కులగణన విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ రీసర్వే వంటి అంశాలపై చర్చించనున్నారు.
సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది(KCR). రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు.
ఇక ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం(BRS Party Meeting) మొదట నిర్ణయించింది. అయితే బహిరంగసభను నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు నిర్వహించాలా? లేదా పార్టీ అధ్య క్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించా లా? అనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. మొత్తంగా పార్టీ అనుబంధ కమిటీలు, చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.