
Newdelhi, Feb 18: బీఆర్ఎస్ పార్టీ (BRS) నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై (MLAs) చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న నాయవాది వాదనపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా? అని ప్రశ్నించింది. ఇప్పటికే 14 నెలలు గడిచిపోయాయని... స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే... తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, ఉప ఎన్నికలు అనివార్యం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కూరగాయలతో కాలేయ క్యాన్సర్ కు చెక్.. ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..
- అరికెపూడి గాంధీ
- పరిగి శ్రీనివాస్ రెడ్డి
- ఎం.సంజయ్ కుమార్
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- గూడెం మహిపాల్ రెడ్డి
- ప్రకాశ్ గౌడ్
- కాలే యాదయ్య
- కడియం శ్రీహరి
- దానం నాగేందర్
- తెల్లం వెంకట్రావు
తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!