Plane Landing: ఈ తరహా విమానం ల్యాండింగ్ ఎప్పుడూ చూసి ఉండరు. మనుషులను తాకడమే మిగిలింది మరి.. నెట్టింట్లో వీడియో వైరల్
అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయిన విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్
Athens, August 12: గ్రీస్‌లోని (Greece) స్కియాథోస్ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ (landing) అయిన విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్ దృశ్యాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. సముద్రపు నీటిని, మనుషులను తాకుతుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్ లో ఈ ప్లేన్ దిగింది.
ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా? అన్నట్లు కనిపించింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే (runway) కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్‌పోర్ట్ 1972లో ప్రారంభమైంది.