ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత డ్రా చేశారన్న దానిపై వివరాలు తెలియరాలేదు. ఉత్తరాఖండ్‌లో ఈ వింత ఘటన జరిగింది. కాగా ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.
దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. అంతకుముందే అందులో రూ. 24 లక్షలు నగదు ఉంచినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Uttarakhand | Eight shops damaged due to an increase in the water level of Kumola Khad due to excessive rainfall in Purola, Uttarkashi. pic.twitter.com/Q4gJrUivzc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 11, 2022
దీనిపై పంజాబ్ బ్యాంక్ అధికారులు ఇంకా స్పందించలేదు.