The Horror: కుట్టరాని చోట కుట్టిన పాము, నొప్పితో విలవిలలాడిన యువకుడు, అసలేం జరిగింది.. ఆ తర్వాత ఏమయింది? తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే!
పాము కుడితే ప్రథమ చికిత్సగా విషం ఎక్కకుండా గట్టిగా కట్టుకట్టవచ్చు, కానీ ఆ పాపం పసివాడికి....
ఇదొక విచిత్ర సంఘటన, పడగ విప్పిన పాము ఒకటి తన శత్రువుపై దండెత్తినట్లు అనిపించే వింత ఘటన. పాము కుడితే ప్రథమ చికిత్సగా విషం ఎక్కకుండా గట్టిగా కట్టుకట్టవచ్చు, కానీ ఆ పాపం పసివాడికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఏదో జన్మజన్మల పగ ఉన్నట్లు కుట్టరాని చోట కుట్టి ఆ యువకుడికి పట్టపగలే చిమ్మచీకటిని చూపించింది.
వివరాల్లోకి వెళ్తే, మొన్న మంగళవారం రాత్రి పూట థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ సిటీకి అవతల ఉన్న ఒక పట్టణంలో సిరాహాప్ ముసుకారత్ అనే 18 ఏళ్ల యువకుడు టాయిలెట్ గద్దెపై కూర్చున్నాడు. కొద్దిసేపటికే అతడి అంగానికి చిటుక్కుమని ఏదో కుట్టినట్లు అనిపించింది. వెంటనే భరించలేని నొప్పి కలిగింది అతడికి, చీమ కావొచ్చు అనుకున్నాడు కానీ చూస్తే అది నాలుగడుగుల నల్లటి పాము. ప్రాణ భయంతో ముసుకారత్ తన ప్యాంట్ పట్టుకొనే గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీశాడు, పాము కరిచిన భాగం నుంచి రక్తం చిమ్మబడింది.
యువకుడి పరిస్థితి చూసిన అతడి కుటుంబ సభ్యులు వెంటనే వైద్యబృందానికి సమాచారం అందించారు, వారు వచ్చే లోపు ఆ యువకుడికి తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలతో అతడిని నొప్పిని చల్లబరిచారు. వైద్య బృందం పరిశీలించి చూడగా, పాము కాటుకి అతడి అంగం చిట్లిపోయింది. వెంటనే అతడికి చికిత్స చేశారు, అదృష్టవషాత్తూ అది విషం లేని పాము అని తేలడంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు, అయితే అతడి అంగానికి 3 కుట్లు పడ్డాయి.
ఏది ఏమైనా ఈ సంఘటన ముసుకారత్‌కు జీవితంలో మరిచిపోలేని ఘటనగా నిలిచింది. ఆ పాము మరి తనకు ప్రత్యర్థి పాము వచ్చిందనుకుందో, ఇంకేం అనుకుందో ఇలా జరగటం బాధాకరం. ఆ తర్వాత కూడా ఆ పాము వారి టాయిలెట్ గదిలోనే ఉండటంతో ముసుకారత్ ఆ పామును వీడియో తీసి తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఎప్పుడైనా టాయిలెట్ గదికి వెళ్లేటపుడు, లేదా బయటకు వెళ్లేటపుడు చుట్టుపక్కల అంతా గమనించాలని అతడు సందేశమిస్తున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.