Ratna Bhandar of Lord Jagannath Reopens Today: 49 ఏండ్లపాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని నేడే తెరువనున్నారు.. పూర్తి వివరాలు ఇవిగో..!
ఏండ్లకేండ్ల పాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారం ఆదివారం తెరుచుకోనుంది.
Puri, July 14: ఒడిశాలోని (Odisha) పూరీ జగన్నాథుడి ఆలయంలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 49 ఏండ్లపాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారం (Ratna Bhandar of Lord Jagannath Reopens Today) ఆదివారం తెరుచుకోనుంది. ఈ మేరకు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. రత్న భాండాగారంలో విష సర్పాలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. కాగా, భాండాగారం తలుపులు తెరవడానికి ఎంత మంది వెళ్తారన్న దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రక్రియంతా పూర్తి చేయడానికి మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
సేవలకు అంతరాయం కలుగొద్దు
శ్రీ పవిత్ర క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్ లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదన్నది శాస్త్రం. ఇలాంటి సమయంలో రత్న భాండాగారం ఎలా తెరుస్తారు? నిధి లెక్కింపు ఎలా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)