Gujarat Farmer Ayyub Degiya: కోరిక తీర్చలేని భార్య, సుఖం కోసం 7వ పెళ్లికి రెడీ అయిన భర్త, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో సంచలన ఘటన, పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు
తన కోరికలు తీర్చడం లేదని (Refused intercourse) భార్యను వదిలేసి 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.
Surath, Jan 25: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఓ రైతు లేటు వయసులో ఏడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. తన కోరికలు తీర్చడం లేదని (Refused intercourse) భార్యను వదిలేసి 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. పోలీసుల విచారణలో ఈ రైతు (Gujarat farmer Ayyub Degiya) గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలో ఓ ధనిక రైతు తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందన్న కారణంగా అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్న అతను..కరోనా కారణంగా ఆమె అతన్ని దూరం పెట్టడంతో డిసెంబర్ నెలలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే తను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెబుతున్నాడు. ఇదిలా ఉంటే పెళ్లైన చాలా రోజులకు అతడికి తాను ఆరో భార్యనని ఆ మహిళకు తెలిసింది. అతడి వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి వివాహం చేసుకొని, వాడుకొని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరోపించింది.
కాగా, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై 498-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు చెప్పడం పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది.