Ranveer Allahbadia Controversy Video

Mumbai, Feb 10: తల్లిదండ్రుల శృంగారంపై నోటికొచ్చింది మాట్లాడి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు 31 ఏళ్ల యూట్యూబర్ (YouTuber) రణ్‌వీర్‌ అలహబాదియా. యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్‌కు చెందిన రణ్‌వీర్ అలహబాదియా.. కమెడియన్‌ సమయ్‌ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు (Ranveer Allahbadia Controversy Video) చేశారు.

కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న రణ్‌వీర్‌ అలహబాదియా.. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని (Ranveer Allahbadia Parental Sex Question) నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను ప్రశ్నించాడు.

తల్లిదండ్రుల శృంగారంపై పనికిమాలిన వ్యాఖ్యలు, హద్దులు దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

ఈ ప్రశ్నపై నెటిజన్‌లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏకంగా ముంబై పోలీస్‌ కమిషనర్‌కు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ''హద్దులు దాటితే చర్యలు ఉంటాయి'' అని హెచ్చరించారు. ఈ వివాదం విస్తృత చర్చకు దారితీసింది, చాలామంది ఆ యూట్యూబర్‌పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ 'ఎక్స్' వేదికగా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.

Ranveer Allahbadia Sorry Video

Maharashtra CM on Ranveer Allahbadia Controversy Video

వీడియోలో తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని వీడియోలో కోరాడు. పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, నాకు హాస్యం చేయడం రాదని, అయినా హాస్యం చేయబోయి తప్పు మాట్లాడానని తెలిపారు. ఇండియాస్ గాట్ లాటెంట్‌లో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. అందులో ఎలాంటి హాస్యం లేదు. కామెడీ నా బలం కాదు. అనుచిత వ్యాఖ్యలతో ఛానెల్‌కు ప్రచారం తెచ్చుకోవాలనుకుంటున్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

వీడియో ఇదిగో, మీ తల్లిదండ్రులు సెక్స్‌లో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా అంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు, పనికిమాలినోడా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

నా ఉద్దేశం అది కాదు. నేను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదు. నన్ను క్షమించండి. అన్ని వయస్సులు వారు ప్రాడ్‌కాస్ట్‌ను చూస్తారు. అలాంటప్పుడు బాధ్యతగా ఉండాలనే విషయాన్ని తేలిగ్గా తీసుకునే వ్యక్తిని కాదు. కుటుంబ భావన పట్ల నాకు ఎలాంటి అగౌరవం లేదు. నేను ఈ వేదికపై మరింత మెరుగ్గా పనిచేయాల్సిన ఉందనే విషయాన్ని ఈ అనుభవం నేర్పింది'' అని పేర్కొన్నారు. తన అనుచిత వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా వీడియో మేకర్స్‌ను కోరానని, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానని, మనవాతా దృష్టితో తనను క్షమిస్తారని ఆశిస్తున్నానని చెబుతూ తన వీడియోను ముగించారు.