తల్లిదండ్రుల శృంగారంపై నోటికొచ్చింది మాట్లాడి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు 31 ఏళ్ల యూట్యూబర్ (YouTuber) రణ్‌వీర్‌ అలహబాదియా. యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్‌కు చెందిన రణ్‌వీర్ అలహబాదియా.. కమెడియన్‌ సమయ్‌ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న రణ్‌వీర్‌ అలహబాదియా.. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను ప్రశ్నించాడు.

వీడియో ఇదిగో, మీ తల్లిదండ్రులు సెక్స్‌లో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా అంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు, పనికిమాలినోడా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

ఈ ప్రశ్నపై నెటిజన్‌లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏకంగా ముంబై పోలీస్‌ కమిషనర్‌కు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ''హద్దులు దాటితే చర్యలు ఉంటాయి'' అని హెచ్చరించారు. ఈ వివాదం విస్తృత చర్చకు దారితీసింది, చాలామంది ఆ యూట్యూబర్‌పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 Devendra Fadnavis Reacts to Controversial Remark of YouTuber

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)