Saivarshith-Biden Case: బైడెన్‌ను చంపేందుకే వచ్చానన్న తెలుగు యువకుడు సాయివర్షిత్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా?!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- తెలుగు యువకుడు సాయివర్షిత్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్‌ ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Sai Varshith Kandula (PIC@ Twitter)

Newyork, May 26: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు (American President) జో బైడెన్‌ (Joe Biden) తెలుగు యువకుడు సాయివర్షిత్ (Saivarshith) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్‌ ను చంపుతానంటూ వైట్‌హౌస్ (Whitehouse) పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు  బుధవారం ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ వెల్లడించారు. బుధవారం ఆరెంజ్ రంగు జైలు దుస్తుల్లో కోర్టుకు హాజరైన సాయివర్షిత్, న్యాయమూర్తి అడిగిన సమాధానాలకు వినయంగా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటూ రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి సాయివర్షిత్‌కు వివరించారు. మే 30 దాకా కస్టడీ విధించారు.

APPSC Group 1 & Group 2 Notification: ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

అసలేం జరిగింది?

సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రంలో నివసిస్తుంటాడు. అతడు గతంలో డేటా అనలిస్ట్‌గా పనిచేశాడు. సోమవారం రాత్రి అతడు ఓ భారీ ట్రక్‌ నడుపుతూ శ్వేత సౌధం పరిసరాల్లోకి దూసుకొచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిపై ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తదితర అభియోగాలను మోపారు.

రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement