TS High Court Recruitment 2023: రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..
High Court of Telangana | (Photo-ANI)

నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి. ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ ఆన్‌లైన్‌లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త, NPCIL 129 పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అర్హత ఏంటో తెలుసుకోండి

దీంతో పాటు వివిధ కోర్టుల్లో 144 టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ ఆన్‌లైన్‌లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు.

Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి 

దీంతో పాటుగా వివిధ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ (Copyist) పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు (Telangana State High Court) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఇంట‌ర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ (స్కిల్‌ టెస్ట్‌) ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ ఆన్‌లైన్‌లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు.

1. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 మొత్తం పోస్టులు : 96

అర్హ‌త‌లు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి.

వయస్సు : 18-34 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.32810 నుంచి రూ.96890

ఎంపిక : ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.400.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25

చివరి తేది: జూన్ 15

వెబ్‌సైట్ : https://tshc.gov.in/

2. టైపిస్ట్‌ పోస్టులు మొత్తం పోస్టులు : 144

అర్హ‌త‌లు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి.

వయస్సు : 18-34 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.24280 నుంచి రూ.72850

ఎంపిక : ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.400.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25

చివరి తేది: జూన్ 15

వెబ్‌సైట్ : https://tshc.gov.in/

3. కాపీయిస్ట్(Copyist) మొత్తం పోస్టులు : 84

అర్హ‌త‌లు : ఇంట‌ర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌డం) వ‌చ్చి ఉండాలి.

వయస్సు : 18-34 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.22900 నుంచి రూ.69150

ఎంపిక : ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.400.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25

చివరి తేది: జూన్ 15

వెబ్‌సైట్ : https://tshc.gov.in/