APPSC Group 1 & Group 2 Notification: ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
YS Jagan (Photo-Twitter)

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

కాగా గురువారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.

రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుందని పేర్కొన్నారు.