Rs 35k Fine For Not Providing Pickle To Meal: భోజనంలో ఊరగాయ వేయనందుకు రూ.35 వేల ఫైన్.. ఎక్కడ జరిగిందంటే?
విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు.
Chennai, July 26: అది తమిళనాడు (Tamilnadu) రాష్ట్రం. విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ (Hotel) నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు. అయితే భోజనంలో అన్ని ఉన్నప్పటికీ ఊరగాయ మిస్ అయింది. ఇదే విషయమై హోటల్ యజమానిని ప్రశ్నిస్తే, నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తిపోయిన వినియోగదారుడు.. వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. కేసు విచారణ రెండేళ్ల పాటు జరిగింది.
‘ఉదర క్యాన్సర్’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?
తీర్పు ఏమిటంటే?
పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం.. అన్నంలో ఊరగాయ వేయకపోవడం సేవల్లో లోపమని పేర్కొంటూ రెస్టారెంట్ కు కమిషన్ రూ.35,025 జరిమానా విధించింది. వినియోగదారుడి ఖర్చుల కోసం 5 వేలు, ఊరగాయల ప్యాకెట్లకు మొత్తం రూ.25 ఇవ్వాలని ఆదేశించింది.