
Newdelhi, July 26: ప్రపంచ మానవాళిని పీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్‌లలో (Cancer) ఉదర క్యాన్సర్ (Stomach Cancer) ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం కష్టమే. సాధారణంగా ఉదర క్యాన్సర్ ప్రారంభంలో ఉండే లక్షణాలు అజీర్ణ సమస్యతో ఉండే లక్షణాలను పోలి ఉంటాయి. అయితే, ముఖంపై (Face) వచ్చే కొన్ని లక్షణాలను బట్టి ప్రారంభ దశలోనే ఉదర క్యాన్సర్ ను గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఉదర క్యాన్సర్ వల్ల పాపులో ఎరిత్రోడెర్మ అనే అరుదైన చర్మ సంబంధ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ముఖంపై చిన్న గడ్డలు
ఇక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వల్ల ముఖంపై చిన్న గడ్డలు ఏర్పడటం, వాపు రావడం జరగొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు చర్మం పొడిబారి ఊడిపోవడం, దురద వంటి లక్షణాలూ కనిపించవచ్చని చెప్తున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే, జాగ్రత్త పడటం ముఖ్యమని సూచించారు.