Tamil Nadu: కుక్క పిల్లకు ఘనంగా సీమంతం, మహిళలకు మిఠాయిలు, జాకెట్ బట్ట, గాజులు, తాంబూలం అందించిన దాని యజమాని, ఆహ్వాన పత్రికలతో బంధు మిత్రులను ఆహ్వానించిన తమిళనాడు దంపతులు
పెంపుడు కుక్కకు సీమంతం చేశారు ఓ దంపతులు. ఓ శునకాన్ని తమ కుటుంబంలోని సభ్యుడిగా చూసుకుంటోన్న ఓ జంట దానికి తాజాగా సీమంతం (Baby Shower Function) చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తమిళనాడులో వింత ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్కకు సీమంతం చేశారు ఓ దంపతులు. ఓ శునకాన్ని తమ కుటుంబంలోని సభ్యుడిగా చూసుకుంటోన్న ఓ జంట దానికి తాజాగా సీమంతం (Baby Shower Function) చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులోని సేలం జిల్లా మెచ్చేరికి చెందిన స్టూడియో యజమాని మురుగన్, సుశీల దంపతుల ఇంట్లో Sarah అనే కుక్క పిల్లకు సీమంత వేడుక జరిగింది.
వారి కుమార్తె హేమరాణి రెండు కుక్కలను తీసుకొచ్చి, పెంచుకుంటోంది.ఆ కుక్కలను కూడా మురుగన్, సుశీల దంపతులు తమ సొంతింటి వ్యక్తిలా చూసుకుంటున్నారు. పొమేరియన్ రకానికి చెందిన హైతి అనే మగ శునకాన్ని, సారా అనే ఆడ కుక్కకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. సారా గర్భం దాల్చడంతో సీమంతం (Baby Shower Function to Pet Dog) చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఆహ్వాన పత్రికలు ముద్రించి, తమ బంధు మిత్రులను ఆహ్వానించారు.
ఆ కుక్క సీమంతానికి మహిళలను పిలిచి వారికి మిఠాయిలు, జాకెట్ బట్ట, గాజులు, తాంబూలం వంటివి సమర్పించుకున్నారు. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కుక్కను ఆశీర్వదించారు.