IPL Auction 2025 Live

Road Collapses: హైదరాబాద్ లోని గోషా మహల్ లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు... గుంతలో పడిపోయిన కార్లు, ఆటోలు, కూరగాయల దుకాణాలు.. వీడియో ఇదిగో!

దీంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Credits: Video Grab

Hyderabad, Dec 24: హైదరాబాదులోని (Hyderabad) గోషామహల్ (Gosha Mahal) లో ఓ రోడ్డు (Road) ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయింది (Collapsed). దీంతో  అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చక్నావాడిలో పట్టపగలు ఓ నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. దాని వల్ల పెద్ద గుంత ఏర్పడగా, అందులో పలు కార్లు (Cars), ఆటోలు (Autos) పడిపోయాయి.  ఆ ప్రాంతంలో సంత జరుగుతుండగా, పలు కూరగాయల దుకాణాలు కూడా ఆ గోతిలో పడిపోయాయి.

పేదలకు న్యూఇయర్ గిఫ్ట్, ఫ్రీ రేషన్‌ స్కీంను మరో ఏడాది పెంచుతూ కేంద్రం నిర్ణయం, ఉచిత పథకంలో ప్రతీ సంవత్సరం రూ.2లక్షల కోట్ల భారం

ఈ ఘటనతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి సహాయకచర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కరోనా కలవరం, దేశ సైన్యానికి సూచనలు జారీ చేసిన ఆర్మీ ఉన్నతాధికారులు, ఫేస్ మాస్క్‌లు, సామాజిక దూరం తప్పనిసరని ఆదేశాల్లో వెల్లడి

నగరంలో పురాతనమైన నాలాలు ఉన్నాయని, ఇష్టానుసారం ఆక్రమణలకు పాల్పడడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని వివరించారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని తెలిపారు.