
Hyderabad, Mar 2: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి. టన్నల్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ఆదివారం అక్కడికి వెళ్లనున్నారు. వనపర్తి బహిరంగ సభ నుంచి హెలికాఫ్టర్ లో నేరుగా ఆయన టన్నల్ వద్దకు బయలుదేరనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు చేరుకోనున్నట్టు సమాచారం. హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్నల్ లో నలుగురు కార్మికుల ఆచూకీ లభ్యమైంది. ఈ రోజు సాయంత్రానికి వారిని బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వారు బతికే అవకాశం కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉందని రెస్క్యూ టీం నిపుణులు చెబుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ లాంటి 18 సంస్థలు, 703 మంది సహాయక సిబ్బంది 3 షిప్టుల వారీగా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి శిథిలాక కింద గుర్తించగా.. మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కింద చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 450 అడుగుల పొడవైన టీబీఎంను కత్తిరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోయిన పైకప్పు కింద ఇంజనీర్లు, కార్మికులు సహా ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
SLBC ప్రమాద స్థలానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
వనపర్తి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో SLBCకి ముఖ్యమంత్రి
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి https://t.co/vOcisIlW5J pic.twitter.com/U4O046O89C
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025
రేవంత్ షెడ్యూల్ ఇదిగో..
- నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.
- ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్ లో వనపర్తి పర్యటనకు బయల్దేరుతారు.
- 11.30కు వనపర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేస్తారు.
- మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ZPHS పాఠశాలలో వసతులు పరిశీలిస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
- మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీతో పాటు అక్కడ ఏర్పాటుచేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొంటారు.
- సాయంత్రం 4.15కు వనపర్తి నుంచి ఎస్‌ఎల్‌బీసీ టన్నల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకొంటారు. పరిస్థితిని సమీక్షిస్తారు.
చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)