Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??

నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. అంటే ఏమిటంటే??

Penumbral Lunar Eclipse (Credits: Twitter)

Newdelhi, May 5: ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం (Lunar Eclipse) నేడు ఏర్పడబోతోంది. రాత్రి 8.42 గంటలకు మొదలై అర్ధరాత్రి (Mid Night) దాటిన తర్వాత 1.04 గంటల వరకు ఈ గ్రహణం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ (Penumbral Lunar Eclipse) అంటారు.  నేటి గ్రహణం  భారత్‌లో కనిపించదని ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా అధికారులు తెలిపారు. గ్రహణ ప్రభావం భారత్‌లో  ఉంటుందని వస్తున్న వార్తలను నమ్మవద్దని వాళ్లు కోరారు. అలాగే, పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావం ఉంటుందని చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.

CM Jagan in Action: జీవో నంబర్-1 అమలుపై సీఎం జగన్ కీలక ప్రకటన, రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు రాకుండా సమర్ధవంతంగా దాన్ని అమలు చేయాలని డీజీపీకి ఆదేశాలు

పెనుంబ్రల్ లూనార్ అంటే ఏమిటి?

సాధారణంగా చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి వెలుపలి నీడలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు చంద్రుడు క్రమంగా చీకట్లోకి వెళ్లిపోవడం కనిపిస్తుంది కానీ, పూర్తిగా అదృశ్యం కాడన్నమాట. అంటే మనకు లీలగా కనిపిస్తూనే ఉంటాడన్నమాట. నిజానికిది ఖగోళ అద్భుతం. మళ్లీ ఇలాంటి గ్రహణం సెప్టెంబరు 2042లో కనిపిస్తుంది.

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను రేపు విడుదల చేయనున్న జగన్ సర్కారు

ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు

ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఇప్పటికే సంభవించింది. నేడు చంద్రగ్రహణం. కాగా అక్టోబరు 14న మరో సూర్యగ్రహణం వస్తుండగా, అక్టోబరు 28-29 తేదీల్లో రెండో చంద్రగ్రహణం సంభవిస్తుంది.