YS Jagan (Photo-Twitter)

Amaravati, Mar 4: హోంశాఖ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారు.. చంద్రబాబు రెండు సభలలో అమాయకులు చనిపోయారని సీఎం జగన్‌ అన్నారు.

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను రేపు విడుదల చేయనున్న జగన్ సర్కారు

కాగా, సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు.