YS Jagan Mohan Reddy (Photo-Twitter)

ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(శుక్రవారం) తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

విద్యార్థులకు అలర్ట్, ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ చేసింది జగన్ ప్రభుత్వం.