ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాలనుకుంటే.. ఫలితాలు విడుదలైన వారం రోజులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఏప్రిల్ 26న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
AP SSC ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
దశ 1: bse.ap.gov.in లో అధికారిక BSE వెబ్‌సైట్‌ని సందర్శించండి
దశ 2: హోమ్‌పేజీలో, అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
దశ 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
దశ 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
దశ 5: దానిని డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.