Fined For Driving Car Without Helmet: ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం

ఈ వార్త కూడా మాకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ చదివేయండి. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది.

Fined For Driving Car Without Helmet (Credits: X)

Newdelhi, Aug 26: పోలీసులు (Police) చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వార్త కూడా మాకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ చదివేయండి. హెల్మెట్ (Helmet) ధరించలేదంటూ ఓ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది. తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది. తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్లలేదని, కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు రూ.1000 జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు. జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను బాధితుడు సంప్రదించగా, హెల్మెట్ లేకుండా ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ పోలీసులు సమాధానం ఇచ్చినట్టు బాధితుడు పేర్కొన్నాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని సక్సేనా పేర్కొనడం సంచలనంగా మారింది.

హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..

రూల్ ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వండి

నవంబర్ 9, 2023న ఈ చలాన్ జారీ చేశారని తుషార్ సక్సేనా వెల్లడించారు. హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన