Bouncers to Tomatoes: టమాటాలకు రక్షణగా బౌన్సర్లను నియమించుకున్న కూరగాయాల వ్యాపారి.. ఎందుకో తెలుసా?
ఈ నేపథ్యంలో.. యూపీలోని వారణాసిలో కూరగాయల విక్రయదారుడు ఒకరు కస్టమర్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని టమాటాల నుంచి దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు.
Hyderabad, July 10: దేశవ్యాప్తంగా టమాటా ధరలు (Tomato Prices) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. యూపీలోని (UP) వారణాసిలో (Varanasi) కూరగాయల విక్రయదారుడు ఒకరు కస్టమర్లు (Customers) కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని టమాటాల నుంచి దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు. కూరగాయల విక్రేతలు స్టాక్ ను దొంగిలించకుండా లేదా దోచుకోకుండా రక్షించడానికి తమ వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపాడు.
మెక్ డొనాల్డ్స్ ఇలా..
మెక్ డొనాల్డ్స్ తన బర్గర్ ల నుండి టమాటాలను తొలగించింది. టమాటా ధరలు రికార్డు స్థాయిలకు పెరిగిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాలలో మెక్ డొనాల్డ్ ఈ చర్య తీసకుంది. సీజనల్ సమస్యల కారణంగా టమాటాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మెక్ డొనాల్డ్స్ ప్రతినిధి తెలిపారు.