Balanagar, July 10: హైదరాబాద్ బాలానగర్ లోని (Balanagar) ఓ అపార్ట్ మెంట్ లో (Apartment) అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్ (IDPL) చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్ స్పేస్ (A2A Life Space) అపార్ట్ మెంట్ లోని ఐదో ఫ్లోర్ లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురైన అపార్ట్ మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చేస్తున్నారు.
అదే కారణం
అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.